ద్రవిడ్ సేవలు ప్రశంసనీయం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కితాబు
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. టీమిండియాకు సుదీర్ఘ కాలం పాటు హెడ్ కోచ్ గా పని చేశాడు భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ రాహుల్ ద్రవిడ్. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది అదే ది వాల్. దుర్బేద్యమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతే కాదు క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత జట్టుకు మెరికల్లాంటి యువకులను క్రికెటర్లుగా తీర్చి దిద్దాడు.
ప్రపంచంలోనే మోస్ట్ ఫెవరబుల్ కోచ్ గా గుర్తింపు పొందాడు. భారత క్రికెట్ అకాడమీ చీఫ్ గా బెంగళూరులో తను అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదే సమయంలో బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ తాను ఉన్న కాలంలో పట్టుపట్టి ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా ఉండేలా ఒప్పించారు.
ఈ తరుణంలో భారత జట్టుకు కోచ్ గా విశిష్ట సేవలు అందించాడు. తన హయాంలోనే టీమిండియా 17మ ఏళ్ల అనంతరం 2011 తర్వాత 2024లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో తన పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ ను నియమించింది బీసీసీఐ. హెడ్ కోచ్ గా విశిష్ట సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్ కు ధన్యవాదాలు తెలిపారు కార్యదర్శి జే షా.