నా దేశం కంటే నేను గొప్ప కాదు
స్పష్టం చేసిన హెడ్ కోచ్ గంభీర్
న్యూఢిల్లీ – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఢిల్లీకి చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్, భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బీసీసీఐ కార్యదర్శి జే షా కంగ్రాట్స్ తెలిపారు.
ఇప్పటి వరకు టీమిండియాకు విశిష్ట సేవలు అందించడమే కాకుండా దాదాపు 17 ఏళ్ల అనంతరం భారత క్రికెట్ జట్టుకు ఐసీసీ టి20 వరల్డ్ కప్ తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇప్పటి దాకా హెడ్ కోచ్ గా సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్.
ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ ను నియమించింది బీసీసీఐ. తనను హెడ్ కోచ్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు గౌతమ్ గంభీర్. బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం లేక పోతే నేను లేను. నా అణువణువునా భారతీయం నాలో నిండి పోయిందన్నారు. తన శక్తి వంచన లేకుండా దేశం గర్వించేలా భారత జట్టును తీర్చి దిద్దుతానని గంభీర్ స్పష్టం చేశారు. తనకు గర్వంగా ఉందన్నారు.