ENTERTAINMENT

మాన్వీ మ‌ల్హోత్రాపై మ‌రోసారి ఫిర్యాదు

Share it with your family & friends

ఆధారాల‌తో స‌హా నార్సింగ్ పీఎస్ లో

హైద‌రాబాద్ – తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ హీరో రాజ్ త‌రుణ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు మ‌లుపులు తిరుగుతోంది. త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు రాజ్ త‌రుణ్. ఆయ‌న చెప్పేవ‌న్నీ పూర్తిగా అబ‌ద్దాలంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది లావ‌ణ్య‌. త‌న‌కు ఆయ‌న‌తో సంబంధాలు ఉన్నాయ‌ని , తామిద్ద‌రి మ‌ధ్య శ‌ని లాగా దాపురించింది అంటూ న‌టి మాన్వీ మ‌ల్హోత్రాపై. త‌న వ‌ల్ల‌నే త‌మ కొంప‌లో కుంప‌టి పెట్టిందంటూ వాపోయింది లావ‌ణ్య‌.

ఇప్ప‌టికే ఓ వైపు లావ‌ణ్య మ‌రో వైపు రాజ్ త‌రుణ్ ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు చేసుకున్నారు. వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా ఉండ‌గా బుధ‌వారం మ‌రోసారి లావ‌ణ్య నార్సింగ్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి మాన్వీ మ‌ల్హాత్రాపై ఫిర్యాదు చేసింది. ఆమె వ‌ల్ల త‌న కాపురం కూలి పోతోందంటూ వాపోయింది.

హీరో రాజ్ త‌రుణ్ తో క‌లిసి ఉన్న ఫోటోలు, స్క్రీన్ షాట్స్ తో కూడిన ఆధారాల‌ను పోలీసుల‌కు అంద‌జేశారు లావ‌ణ్య‌. ఇదిలా ఉండగా లావ‌ణ్య త‌న‌ను డ్యామేజ్ చేస్తోందంటూ ఫిల్మ్ న‌గ‌ర్ పోలీస్ స్టేషన్ లో మాల్వీ ఫిర్యాదు చేశారు. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ వాపోయింది.