NEWSTELANGANA

కేసీఆర్ నిర్వాకం తెలంగాణ విధ్వంసం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తమ ప్ర‌భుత్వంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసింది చాల‌క త‌మ‌పై నింద‌లు మోప‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది. ఆనాడు రూ. 16 వేల కోట్ల మిగులు బ‌డ్జెట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే..చివ‌ర‌కు చిప్ప చేతికి ఇచ్చి పోయాడంటూ మండిప‌డింది.

మీరు చేసిన అప్పుల‌ను తీర్చ‌లేక‌, వాటికి వ‌డ్డీలు ఎలా క‌ట్టాల‌నే దానిపై తాము మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నామ‌ని , అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాలక ఆధారాలు లేకుండా విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది.

ప‌దే ప‌దే 80 వేల పుస్త‌కాలు చ‌దివాన‌ని గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్ చివ‌ర‌కు రూ. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పులు త‌మ చేతికి ఇచ్చాడ‌ని వాపోయింది టీపీసీసీ. ఆయ‌న చేసిన అప్పుల‌కు నెల‌కు రూ. 6,000 కోట్లు కిస్తీల కింద చెల్లించాల్సిన దుస్థితికి తీసుకు వ‌చ్చింది మీరు కాదా అంటూ నిప్పులు చెరిగింది.

తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన 7 నెల‌ల కాలంలో రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చామ‌ని, వ‌డ్డీలు క‌ట్టామ‌ని తెలిపింది. ద‌శ‌ల వారీగా జాబ్స్ ను భ‌ర్తీ చేస్తున్నామ‌ని పేర్కొంది. చిల్ల‌ర కామెంట్స్ బంద్ చేసి రాష్ట్ర ప్ర‌గ‌తికి తోడ్పాటు అందిస్తే బావుంటుంద‌ని సూచించింది కాంగ్రెస్ పార్టీ.