కృష్ణా డెల్టాను సస్య శ్యామలం చేస్తాం
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి – కృష్ణా డెల్టాను సస్య శ్యామలం చేయడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బుధవారం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎడమ కాల్వలకు నీరు విడుదల చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
11 నియోజక వర్గాల్లో 35 మండలాల్లో లక్షలాది ఎకరాలను స్టిరీకరించడమే లక్ష్యంగా సాగు నీరు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు . తాగు, సాగు నీటిని అన్ని ప్రాంతాలకు అందించేందుకు గాను నీటిని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పారు కొల్లు రవీంద్ర.
పులిచింతలలో 35 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉన్నా 0.5 టీఎంసీల నీరు లేకుండా తయారు చేశారంటూ అప్పటి జగన్ రెడ్డి సర్కార్ ను నిందించారు. పట్టిసీమపై అవాకులు చెవాకులు పేలిన వారు ఇప్పుడు విడుదలైన నీటిని చూసి ఏమంటారో వారికే తెలియాలని అన్నారు.
కాలవల్లో పనులు చేయకుండానే కోట్లలో బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఇకనై రాష్ట్రంలో ఎక్కడ కూడా నీరు లేదని, రాలేదనే మాట రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు కొల్లు రవీంద్ర.