ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్
కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్
న్యూఢిల్లీ – ఏపీకి చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో బుధవారం ఏపీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.
ఈ సందర్బంగా ఏపీని అన్ని రంగాలలో ముందంజలో తీసుకు పోయేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు. ప్రత్యేకించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు కలిగిన నాయకుడు కావడం , ఇటు ఏపీలో అటు కేంద్రంలో కీలకమైన స్థానాలలో ఉండడం వల్ల మరిన్ని నిధులు మంజూరు చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ముందుకు సాగాలని , ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన , మిగిలి పోయిన నిధులను వెంటనే మంజూరు అయ్యేలా చూస్తామని, ఈ మేరకు తాను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.