NEWSNATIONAL

విడాకుల త‌ర్వాత భ‌ర‌ణం ఇవ్వాల్సిందే

Share it with your family & friends

సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

న్యూఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా ఈ దేశంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన ముస్లిం మ‌హిళ‌ల భ‌రణానికి సంబంధించి కేసు విచార‌ణ చేప‌ట్టింది.

ముస్లిం మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇచ్చే విష‌యంలో బుధ‌వారం కీల‌క తీర్పును ప్ర‌క‌టించింది. ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకున్న త‌ర్వాత కూడా వారు భ‌ర‌ణం పొందేందుకు అర్హుల‌వుతార‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ముస్లిం స‌మాజానికి, మ‌త పెద్దల‌కు ఇది బిగ్ షాక్ క‌లిగించే తీర్పు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉండ‌గా 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్‌, జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టి వేసింది.

విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం.