కండక్టర్లు..డ్రైవర్లు ఆర్టీసికి అంబాసిడర్లు
స్పష్టం చేసిన ఎండీ వీసీ సజ్జనార్ కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ , వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తమ సంస్థలో కీలకమైన పాత్ర పోషిస్తూ కాపాడుకుంటూ వస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, క్లీనర్లపై ప్రశంసలు కురిపించారు. వారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ పేర్కొన్నారు వీసీ సజ్జనార్.
ఈ సందర్బంగా ఆర్టీసీకి కండక్టర్లు, డ్రైవర్లు బ్రాండ్ అంబాసిడర్లంటూ కితాబు ఇచ్చారు. ఇవాళ సంస్థ అన్ని రంగాలలో దూసుకు పోతోందని, తాము ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి పథకాన్ని ఇచ్చిన టార్గెట్ కంటే ముందే తాము అమలు చేసి చూపించామని స్పష్టం చేశారు. దీంతో సర్కార్ నుంచి తమకు అభినందనలు కూడా వస్తున్నాయని తెలిపారు.
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు తమ తమ గమ్య స్థానాలను చేరుకుంటున్నారని, వీరిని సురక్షితంగా చేర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నది మాత్రం కండక్టర్లు, డ్రైవర్లేనంటూ స్పష్టం చేశారు ఎండీ వీసీ సజ్జనార్.
ఇదిలా ఉండగా ప్రత్యేకంగా ఫ్రెండ్లీ కండక్టర్ అనూప రాణి గురించి ప్రస్తావించారు. ఆమె నవ్వుతూ నవ్విస్తూ వృత్తిని అద్భుతంగా నిర్వహిస్తున్నారంటూ కొనియాడారు. ఆమె ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారంటూ పేర్కొన్నారు.