DEVOTIONAL

ఘ‌నంగా క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌రుడి ఉత్స‌వం

Share it with your family & friends

భారీ ఎత్తున హాజ‌రైన భ‌క్త బాంధ‌వులు

తిరుప‌తి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుప‌తి లోని శ్రీ క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో సాల‌క‌ట్ల‌ సాక్షాత్కార వైభ‌వోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.

రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. అదే విధంగా రెండో రోజు గురువారం హనుమంత వాహనంపై స్వామి వారు ఊరేగారు. మూడో రోజు శుక్రవారం గరుడ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.