స‌ద‌ర్ పండుగ‌కు పైసా ఇవ్వ‌ని స‌ర్కార్ : హ‌రీశ్

Spread the love

మాజీ సీఎం కేసీఆర్ కు యాద‌వులంటే ప్రేమ‌

హైద‌రాబాద్ : దున్న‌ల‌కు పూజ‌లు నిర్వ‌హించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంద‌ని ప్రపంచంలో ఎక్క‌డా లేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. గ‌త ఏడాది స‌ద‌ర్ పండుగ‌కు ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని , ఈసారి కూడా మొండి చెయ్యి చూపించింద‌ని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కి యాదవులు అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియ‌నిది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదవులు మంత్రులుగా ఉన్నారని, .అంతే కాకుండా నలుగురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వ‌హించార‌ని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా యాదవ్ ఉన్నార‌ని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ఉన్న గుర్తింపు ఏంటో మీకే తెలుసు అన్నారు.

యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో కేసీఆర్ ఎంత గొప్పగా చెప్పారో మీరందరూ చూశారని చెప్పారు.ఏ సీఎం కూడా యాదవ జాతి నిజాయితీ గురించి, పనితనం గురించి, నిబద్ధత గురించి శాసనసభలో చెప్పలేదని అన్నారు హ‌రీశ్ రావు. అలా చెప్పిన నాయకుడు ఒకే ఒక్క‌డు కేసీఆర్ అని పేర్కొన్నారు.
సదర్ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. సదర్ పండుగ‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణకు వ్యాపింప చేశార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇవాళ‌ అన్ని జిల్లాల్లో ఈ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు హ‌రీశ్ రావు. యాదవులు ఆనాడు అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి నాగరికతకు ఒక కొత్త రూపు తీసుకు వ‌చ్చార‌ని అన్నారు.

  • Related Posts

    టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో స్పెష‌ల్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveభ‌క్తుల నుండి అభిప్రాయాల సేక‌ర‌ణ కోసం హెల్ప్ లైన్ తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు. కీల‌క నిర్ణ‌యాలకు శ్రీ‌కారం చుట్టారు.…

    తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *