వైసీపీ నేతలకు హైకోర్టు ఊరట
ముందస్తు బెయిల్ మంజూరు
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకులకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసును గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
ఇదిలా ఉండగా కేసుకు సంబంధించి బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరపున దేవినేని అవినాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సినీయర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు.
కేసుతో సంబంధం ఉన్న వైసీసీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది
కేసులో తదుపరి విచారణకు ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు.