DEVOTIONAL

గ‌త పాలకులు వీర‌ప్ప‌న్ వార‌సులు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన బండి సంజ‌య్ కుమార్

తిరుమ‌ల – కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏపీలో గ‌తంలో కొలువు తీరిన వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వైసీపీ పాల‌కులు వీర‌ప్ప‌న్ వార‌సులంటూ ధ్వ‌జ‌మెత్తారు.

గురువారం బండి సంజ‌య్ కుమార్ కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారంటూ మండిప‌డ్డారు.

ఎర్రచందనం దోపిడీతో సర్కార్ కే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బండి సంజ‌య్ కుమార్. శేషాచల కొండల్లో ఎర్ర చందనం దోపిడీపై నివేదిక ఇవ్వాల‌ని కోరుతామ‌న్నారు. నాస్తికులకు, అన్య మతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి.

నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఏడు కొండలను రెండు కొండలుగా మార్చాలని అనుకున్న అన్యమత పాలన పోయిందని ఎద్దేవా చేశారు బండి సంజ‌య్ కుమార్.

అన్య మత పాలన పోయి గోవిందుడి పాలన వచ్చిందన్నారు.