తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి
శ్రీవారిని ప్రార్థించానన్న బండి సంజయ్
తిరుమల – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి జేఈవో వీర బ్రహ్మం. స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. పూజారులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని (లడ్డూ) ఇచ్చారు కేంద్ర మంత్రికి.
పూజలు చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ మీడియాతో మాట్లాడారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూశారని, కానీ స్వామి కరుణ కటాక్షంతో అడ్రస్ లేకుండా పోయారని అన్నారు.
ఇదే సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయు రారోగ్యాలతో విలసిల్లాలని ఆ దేవ దేవుడిని ప్రార్థించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి.