మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు
మాజీ డీజీ సునీల్ కుమార్ పై కూడా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వం మారడంతో ఆయనతో పాటు తనకు సపోర్ట్ చేసిన వారందరికీ చుక్కలు చూపిస్తోంది కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ కూటమి సర్కార్. గతంలో తన హయాంలో స్కిల్ స్కాం కేసు పేరుతో చంద్రబాబు నాయుడును జైలులో వేశారు జగన్ రెడ్డి. దీనికి ప్రతీకార చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభం అయ్యాయి.
తాజాగా జగన్ రెడ్డితో పాటు మాజీ డీజీ సునీల్ కుమార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా మండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు మేరకు జగన్ రెడ్డితో పాటు సునీల్ కుమార్ పై కేసు ఫైల్ చేశామన్నారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని, అంతే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇందులో ఏ1గా మాజీ డీజీ సీఐడీ సునీల్ కుమార్ తో పాటు ఏ2గా సీతారామాంజనేయులు , ఏ4గా విజయ్ పాల్ , ఏ5గా డాక్టర్ ప్రభావతి పై కేసు నమోదు చేశారు.