బాలిక ఘటన బాధాకరం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 8 ఏళ్ల బాలికపై 12, 13 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీ లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్.
శుక్రవారం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడడం దారుణమన్నారు. అత్యాచారంతో పాటు హత్య చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు . దీని గురించి చదవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు.
నేరస్థులు కూడా మైనర్లే కావడం విస్తు పోయేలా చేసిందన్నారు. ఇది శారీరక విద్య గురించి కాదు కానీ యువకుల మనసులు పూర్తిగా భ్రష్టు పట్టి పోయాయని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
అనేక కారణాల వల్ల చెడి పోతుండడం తన మనసును కలిచి వేసిందన్నారు డిప్యూటీ సీఎం. ఇక నుంచి పాఠశాల స్థాయి నుంచే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తాను అభిప్రాయ పడుతున్నట్లు చెప్పారు.