రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాల్
దమ్ముంటే భద్రత లేకుండా ఓయుకు రా
హైదరాబాద్ – కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన రాహుల్ గాంధీని ఏకి పారేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
నిరుద్యోగులను గత బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని, తీరా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి రోడ్ల పాలు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన నిరుద్యోగుల పట్ల ఇంత కర్కశంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్.
ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. భద్రత లేకుండా దమ్ముంటే ఉస్మానియా యూనివర్శిటీకి రావాలని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తే కాంగ్రెస్ సర్కార్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించరాఉ బండి సంజయ్ కుమార్ పటేల్.