కుటుంబ సలహా కేంద్రం వల్ల ఎంతో మేలు
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు జిల్లా – కుటుంబ సలహా కేంద్రం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. శుక్రవారం మహిళా పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళలు ప్రతి నిత్యం ఏదో రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలిచి భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఎస్పీ. దీని వల్ల ఎంతో సౌకర్యంగా, సురక్షితంగా ఉంటుందన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం కుటుంబం సుస్థిరత ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సలహా కేంద్రం ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, మహిళలపై జరిగే హింసను తగ్గించేందుకు దోహద పడుతుందన్నారు మణికంఠ చందోలు.
నిరంతర శిక్షణ , అవగాహన కార్యక్రమాలు నిర్వహాంచడం ద్వారా మహిళల భద్రతను, వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మహిళలకు మనో ధైర్యం, భద్రత కల్పించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.