ప్రజా వైద్యానికి పెద్ద పీట
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
అమరావతి – ప్రజలకు మెరుగైన రీతిలో వైద్య సౌకర్యాలను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బుచ్చిరెడ్డి పాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దొడ్ల రుక్మిణమ్మ , వరదా రెడ్డి, దొడ్ల పార్ధసారధి రెడ్డి – లలితమ్మ ట్రస్ట్ తరఫున పరికరాలు అందించారు.
అత్యాధునిక CTG మెషిన్ (కార్డియోటోకోగ్రఫీ), దొడ్ల కోదండ రామిరెడ్డి సమకూర్చిన ఫిజియో ధెరఫి సైకిల్ , బెడ్ స్కీన్స్ లను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆసుపత్రిని పరిశీలించారు. ల్యాబ్‌లు, ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు సమస్యలను వైద్యాధికారి ప్రభావతి తన దృష్టికి తెచ్చారన్నారు. రోజుకు దాదాపు 250 నుంచి 300 మంది అవుట్ పేషంట్లకు సేవందించే ఈ ఆసుపత్రిలో కొన్ని మౌలిక వసతుల కొరత ఉందని అన్నారు.
చిన్న పిల్లల డాక్టర్ పోస్టు, స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు పోస్టులు వీలైనంత త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాన్పుల వార్డులో ఏ.సి అవసరం ఉందని, అలాగే పోస్ట్ మార్టం రూమ్ సరిగా లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.