టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీ
బెంబేలెత్తుతున్న దుకాణాదారులు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు దూకుడు పెంచారు. ఆయన వచ్చాక సీన్ మారింది. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు సమీక్షలు చేపట్టారు. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని సందర్శించారు. భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదం రుచి, శుచి, నాణ్యవంతంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇదే సమయంలో టీటీడీ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా లేదా ఎక్కువ ధరలకు వస్తువులను అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడ కూడా చెత్తా, చెదారం ఉండ కూడదని టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఆదేశించారు.
శుక్రవారం ఆయన ఆకస్మికంగా తిరుమలలోని పలు ప్రాంతాలను సందర్శించారు. దుకాణాదారులతో మాట్లాడారు. అక్కడక్కడా పరిశీలించారు. తగు సూచనలు అందజేశారు. ఇదే సమయంలో తిరుమల క్యూ లైన్ లో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ పేరుతో వీడియోలు చేయడం , అది వైరల్ కావడాన్ని తీవ్రంగా పరిగణించారు ఈవో. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.