NEWSANDHRA PRADESH

ఏపీ ఐ అండ్ పీఆర్ డైరెక్ట‌ర్ గా హిమాన్షు శుక్లా

Share it with your family & friends

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ఉద్యోగులు, సిబ్బంది

అమరావ‌తి – ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు హిమాన్షు శుక్లా. 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు. గ‌తంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వ‌హించారు. స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా గుర్తింపు పొందారు.

సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన ముద్ర వేశారు హిమాన్షు శుక్లా. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గం.లకు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాన్షు శుక్లా ఐ అండ్ పీఆర్ అధికారులతో సమావేశమై శాఖా పరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా రావడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్, తేళ్ల కస్తూరి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ .మధుసూధన, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్లు సి.వి. కృష్ణారెడ్డి, నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎం.భాస్కర్ నారాయణ, జీవీ. ప్రసాద్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.