బహుమతులు వద్దు కూరగాయలు చాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు
అమరావతి – ఒక చిన్న ఆలోచన ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. ప్రతి మార్పు ఎక్కడో ఒక చోట మొదలు కావాల్సిందే. దీనికి శ్రీకారం చుట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమీక్షలు చేయడం మొదలు పెట్టారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
ప్రధానంగా చెత్త, చెదారం ద్వారా ఆదాయం పొందవచ్చని సూచించారు. ఇదే సమయంలో తనను కలిసేందుకు వచ్చిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు శాలువాలు, బొకేలు, ఇతర గిఫ్ట్ లు ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు అండగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే వాటిని పలు చోట్ల ప్రారంభించనుంది. ఇదే సమయంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఇదిలా ఉండగా శుక్రవారం తనను కలిసిన ఎంపీలకు కీలక సూచనలు చేశారు. శాలువాలు, గిఫ్ట్ లు వద్దని క్యాంటీన్లకు కూరగాయలు ఇవ్వాలని కోరారు డిప్యూటీ సీఎం.