గాడి తప్పిన చంద్రబాబు పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నాని
అమరావతి – ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. మాయ మాటలతో , మోస పూరితమైన హామీలతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారంటూ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోయిందన్నారు.
అబద్దానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అది చంద్రబాబేనంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. తల్లికి వందనం పేరుతో పిల్లలను, తల్లులను అందంగా మోసం చేశాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలనే దానిపై ఫోకస్ పెట్టాలన్నారు.
తాము చేసిన పథకాలనే అమలు చేస్తోందే తప్పా కొత్తగా ఒక్కటైనా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లను నియంత్రిస్తూ తమ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోనే తిరిగి కూటమి ప్రభుత్వం అనుసరిస్తోందని , ఇక రాష్ట్రంలో భిన్నమైన పాలన ఎక్కడుందంటూ నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలను కొంత కాలం మోసం చేయగలరని, ఎల్లకాలం మోసం చేయలేరని చంద్రబాబు నాయుడు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.