కృష్ణ తేజకు కేంద్రం లైన్ క్లియర్
ఏరి కోరి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల పంతం నెగ్గించుకున్నారు. తనదైన ముద్ర కనబర్చేందుకు పాలనా పరంగా కృషి చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఇదిలా ఉండగా దేశంలోనే తన పనితీరుతో ఆకట్టుకున్న కేరళ కేడర్ కు చెందిన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువ ఐఏఎస్ అధికారి ఎం. కృష్ణ తేజను ఏపీకి పంపించాలని కోరారు . ఈ మేరకు ఆయన కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. వెంటనే ఏపీకి డిప్యూటేషన్ పై బదిలీ చేయాలని విన్నవించారు.
ఈ మేరకు మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలతను వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. ఈ మేరకు డీఓపీటీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేరళ నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి వెళ్లాలని స్పష్టం చేసింది. దీంతో ఐఏఎస్ కృష్ణ తేజ హుటా హుటిన డిప్యూటీ సీఎం పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు కీలక బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.