వరద ప్రభావం రైతులకు శాపం
ఆదుకోవాలన్న రాకేశ్ టికాయత్
ఉత్తర ప్రదేశ్ – రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 23 జిల్లాలు పూర్తిగా వరదల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.
దీంతో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు నీటి పాలయ్యాయి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ కిసాన్ రైతు మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్. సాధారణ ప్రజలతో పాటు వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే నీటి పాలయ్యాయని , కేంద్రం వెంటనే స్పందించాలని, బృందాలను పంపించి పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతు అగ్ర నేత.
ఇప్పటికే అప్పులు చేసిన సాగు చేసిన రైతులను ఆదుకోక పోతే ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇకనైనా యూపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి పంటలు నష్ట పోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు రాకేష్ టికాయత్.