రేపే ‘మేక బతుకు’ ఆవిష్కరణ
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో
హైదరాబాద్ – అన్వీక్షి పబ్లికేషన్స్ తెలుగు నాట సాహిత్యాన్ని బతికిస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకునేలా పుస్తకాలను ప్రచురిస్తోంది. వర్దమాన రచయితలు, కవులతో పాటు పేరు పొందిన వారిని కూడా పరిచయం చేస్తోంది. ఇందుకు సంస్థ చీఫ్ , రచయిత అయిన వెంకట్ సిద్దారెడ్డిని అభినందించక తప్పదు. తనతో పాటు మరికొందరు సాహితీ ప్రేమికులతో కలిసి సాహిత్యానికి ప్రాణం పోసే పనిలో బిజీగా ఉన్నారు. అలుపెరుగని రీతిలో శ్రమిస్తున్నారు.
అన్వీక్షి ప్రచురణ సంస్థ ఎన్నో అద్భుతమైన పుస్తకాలను ప్రచురించింది. ఇటీవలే ప్రముఖ సినీ నటుడు, హాస్యానందం బ్రహ్మానందం (కన్నెగంటి బ్రహ్మానంద చారి) జీవిత కథను ప్రచురించింది. ఆశించిన దానికంటే ఎక్కువగా అమ్ముడు పోయాయి.
తాజాగా మరో అద్బుతమైన పుస్తకానికి తెర తీశారు వెంకట్ సిద్దా రెడ్డి. ప్రముఖ రచయిత్రి స్వర్ణ కిలారి అనువాదం చేసిన మేక బతుకు పుస్తకం ఇప్పుడు మార్కెట్ లోకి రాబోతోంది. జూలై 14న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న ప్రసాద్ ల్యాబ్స్ లో పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10. 30 గంటలకు సాహితీ పిపాసకులు, ప్రేమికులు, అభిమానులు, కవులు, రచయితలు, గాయనీ గాయకులు , మేధావులు హాజరు కానున్నారు.
వీలైతే మీరు కూడా ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావాలని ఆశిస్తున్నాం.