NEWSTELANGANA

పంతుళ్లు ప‌ట్ట‌ణాలే అంటే ఎలా..?

Share it with your family & friends

కాంగ్రెస్ ఎంపీ కిర‌ణ్ కుమార్ చామ‌ల

భువ‌న‌గిరి – కాంగ్రెస్ పార్టీకి చెందిన భువ‌న‌గిరి ఎంపీ కిర‌ణ్ కుమార్ రెడ్డి చామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పంతుళ్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఓ వైపు ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ బ‌డుల‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు న‌డుం బిగించార‌ని పేర్కొన్నారు. కానీ అందుకు భిన్నంగా పంతుళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విద్యార్థుల హాజ‌రు శాతాన్ని పెంచాల‌ని కృషి చేస్తుంటే టీచ‌ర్లు మాత్రం ప‌ట్టించు కోవడం లేద‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణాల‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉంటామ‌ని, త‌మ‌కు బ‌దిలీలు అక్క‌డికి చేయాలంటూ పైర‌వీలు చేస్తున్నారంటూ వాపోయారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి.

పంతుళ్లు ప‌ట్ట‌ణాలే ప్రిఫెర్ చేస్తూ పోతే ఇక ప‌ల్లెల్లోని పాఠ‌శాల‌లు ఎలా బాగు ప‌డ‌తాయ‌ని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్దతి కాద‌ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌మ ప్ర‌భుత్వం బ‌డుల‌ను బాగు చేయాల‌ని సీఎం త‌ల‌పించార‌ని, కానీ టీచ‌ర్లు ప‌ల్లెల్లోకి వ‌చ్చేందుకు విముఖ‌త చూప‌డం దారుణ‌మ‌న్నారు.

మొత్త్ంగా ప్ర‌భుత్వ బ‌డులు బాగు ప‌డాలంటే పంతుళ్ల స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి. విద్యార్థుల భ‌విష్య‌త్తును స‌మున్న‌తంగా తీర్చి దిద్ద‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.