ధార్మిక..ఆధ్యాత్మిక సంస్థలతోనే స్వాంతన
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం మంగళగిరిలో ఇస్కాన్ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సంపదను సృష్టించడం ద్వారానే సంక్షేమం అందుతుందని అన్నారు. ప్రజల జీవితాలలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు సీఎం.
కూటమి గెలుపుతో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ప్రజలు హాయిగా జీవిస్తున్నారని అన్నారు. ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతోనే స్వాంతన కలుగుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఇంకా మొదలు పెట్టక ముందే ప్రజల్లో నమ్మకం మొదలైందని అన్నారు. హరే కృష్ణ మూవ్మెంట్, అక్షయ పాత్ర చేస్తున్న ఆధ్యాత్మిక సేవను అభినందిస్తున్నానని అన్నారు. వెంకటేశ్వర ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరి అదృష్టమని చెప్పారు సీఎం. మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని అన్నారు. హరేకృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రాలు దేశంలో 20 ఉన్నాయి…ప్రపంచంలో 5 ఉన్నాయి. హరేకృష్ణ మూవ్ మెంట్ తో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోందన్నారు.
మధు పండిత్ దాస అనుకున్నది సాధిస్తారని, నమ్మిన సిద్ధాంతం కోసం కష్ట పడతారని కొనియాడారు. సత్యగౌర చంద్రదాస్ కూడా ఐఐటీలో చదివారు. హరేకృష్ణ మూవ్ మెంట్ లో ఐఐటీలో చదివిన వారు 50 మంది ఉన్నారని ఇది గర్వ కారణమన్నారు. మన దేశ సంసృతి, సాంప్రదాయాలు కాపాడటానికి జీవితాలు త్యాగాలు చేశారని ప్రశంసించారు.