DEVOTIONAL

ప్రార్థ‌నాల‌యాలు దైవానికి దారులు

Share it with your family & friends

హెచ్చ‌రించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

మంగ‌ళగిరి – ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలైనా ఈ భూమిపై లేక పోతే జైళ్లు చాలవు అన్నారు. నేరాలు, ఘోరాలు ఎన్నో జరిగేవని పేర్కొన్నారు.

సైంటిస్టులు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, న్యాయ వ్యవస్థ…ఇలా అందరూ తమ విధులు ప్రారంభించడానికి ముందు రెండు నిమిషాల పాటు దేవున్ని ప్రార్థిస్తారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా దేవుడికి ప్రార్థనలు చేశాకే రాకెట్లు నింగిలోకి పంపుతారని చెప్పారు.

హరేకృష్ణ మూవ్ మెంట్ దేవుని సేవ మాత్రమే కాకుండా మానవ సేవ కూడా చేస్తోందని ప్ర‌శంసించారు నారా చంద్ర‌బాబు నాయుడు. యూపీలో వంద ఎకరాల్లో 700 అడుగుల కృష్ణుడు దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. కొలనుకొండలో 6.5 ఎకరాల్లో ఇక్కడ దేవాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.

తాను సాంకేతిక పరిజ్ణానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. 25 ఏళ్లకు ముoదు ఐటీని ప్రమోట్ చేస్తే అన్ని దేశాలకు మన దేశానికి చెందిన వారు వెళ్లారు…వారిలో 30 వాతం మంది తెలుగు వారు ఉన్నారని చెప్పారు.

ఎప్పుడూ వెంకటేశ్వర స్వామినే నమ్ముతానని అన్నారు. త‌మ‌ కుటుంబ ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ప్రతి రోజు రెండు నిమిషాలు దేవున్ని తలుచుకుంటానని అన్నారు. 2003లో తిరుపతిలో 23 క్లేమోర్ మైన్స్ పేలినప్పుడు త‌న‌కు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామేన‌ని తెలిపారు. మరింత శక్తి, సామర్థ్యాన్ని ఇవ్వాలని, దేశంలో తెలుగువారు నెంబర్ వన్ జాతిగా ఉండేలా దీవించాలని కోరుకుంటాన‌ని చెప్పారు.