NEWSTELANGANA

స‌ర్కార్ నిర్ణ‌యం వృద్దుల పాలిట శాపం

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా పెన్ష‌నర్ల‌కు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని వాపోయారు.

ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చిన ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత వాటిని మ‌రిచి పోయింద‌ని ఆరోపించారు. ఉన్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఎస‌రు పెట్టే ప‌నిలో ఉంద‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

పెన్ష‌న్లు ఇవ్వాల్సిన స‌ర్కార్ ఉన్న ల‌బ్దిదారుల నుండి సొమ్మును లాక్కునే ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ఇలాంటి త‌ప్పుడు నిర్ణ‌యాలు ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకు వ‌స్తామ‌ని హెచ్చ‌రించారు.

పేద‌లు, వృద్దుల‌ను ఆదుకోవాల్సిన స‌ర్కార్ ఇలా వారి నుంచి ముక్కు పిండి వ‌సూలు చేయాల‌ని అనుకోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్.

ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇవ్వ‌డంపై పైర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.