మాజీ పీఎం టోనీ బ్లెయిర్ తో లోకేష్ భేటీ
నారా బ్రాహ్మణి కూడా కలిసిన వైనం
అమరావతి – ఏపీ ఐటీ, విద్య, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు భార్య నారా బ్రాహ్మణి శనివారం మర్యాద పూర్వకంగా యునైటెడ్ కింగ్ డమ్ దేశ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేష్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. ప్రత్యేకించి రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, రాజకీయాలు వివిధ రంగాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా వాడు కోవచ్చనే దానిపై విస్తృతంగా చర్చకు వచ్చిందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్.
అంతే కాకుండా ఆదాయ వనరులను ఎలా సమకూర్చు కోవాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ , సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ మరింత కీలకం కాబోతోందని తెలిపారు నారా లోకేష్.
ఎప్పటి లాగే అర్థవంతమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఎజెండాతో తమతో కలిసి పని చేసేందుకు తాము ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.