నా ఫోన్ లో స్పై వేర్ – కేసీ
ఏఐసీసీ నేత ఎంపీ వేణుగోపాల్
న్యూఢిల్లీ – గతంలో స్పై వేర్ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా మరోసారి అది తెర పైకి వచ్చింది. కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై స్పై వేర్ ను ప్రయోగించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున ఎత్తి చూపారు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ. ఇందుకు తాజాగా ఉదాహరణగా చూపించారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.
తాను వాడుతున్న ఐ ఫోన్ లో స్పై వేర్ యాడ్ అయ్యిందని తెలిపారు. దీనిని ప్రధానమంత్రి మోడీ పంపించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా స్పై వేర్ ను ఇన్ బిల్డ్ చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు .
ఇది తనకు ప్రత్యేకమైన గిఫ్ట్ గా భావిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైనదని పేర్కొన్నారు. అయినా నిస్సిగ్గుగా ప్రధానమంత్రి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ పాలన సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేసీ వేణు గోపాల్.
తాజాగా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మోడీ తన తీరు మార్చుకోక పోవడం దారుణమన్నారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి.