NEWSTELANGANA

బీజేపీలో చేర‌డం లేదు – ఎంపీ

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన వ‌ద్దిరాజు ర‌విచంద్ర

హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా తాను భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇందులో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. తాను ఇప్ప‌టికీ గులాబీ పార్టీలోనే ఉన్నాన‌ని, భ‌విష్య‌త్తులో కూడా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

కొంద‌రు కావాల‌ని త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అందులో భాగంగానే తాను బీజేపీలోకి జంప్ అవుతున్నాన‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌.

త‌న‌కు రాజ‌కీయంగా ఛాన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కు రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. బీజేపీలో చేరుతున్నట్లు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.. ఇది బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బ తీసే చర్య.. మేం కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామ‌న్నారు వద్దిరాజు రవిచంద్ర.