NEWSANDHRA PRADESH

అంబానీ త‌న‌యుడి వివాహ వేడుక‌ల్లో సీఎం

Share it with your family & friends

హాజ‌రైన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

ముంబై – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అంబానీ త‌న‌యుడు అనంత్ అనంత్ అంబానీ వివాహ వేడుక‌లు. న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందంగా ముంబైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశ , విదేశాల‌కు చెందిన సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు.

ముంబై న‌గ‌రంలోని రిల‌య‌న్స్ సెంట‌ర్ పూర్తిగా ప్ర‌ముఖుల‌తో నిండి పోయింది. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, త‌న‌యుడు , ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్, భార్య నారా బ్రాహ్మ‌ణితో పాటు ఉప ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల ఈ వివాహ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు.

అనిల్ అంబానీ, భార్య నీతా అంబానీల‌ను క‌లిశారు. అనంత‌రం నూత‌న జంట అనంత్ అంబానీ, కాబోయే భార్య‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. వీరితో పాటు కేంద్ర పౌర‌, విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కూడా ఉన్నారు.