DEVOTIONAL

16న వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం ర‌ద్దు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన టీటీడీ ఈవో

తిరుమ‌ల – శ్రీ‌వారి భ‌క్తుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం . ఈ మేర‌కు ఈనెల 16న మంగ‌ళ‌వారం తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానం కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు, స్వామి వారికి పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌పాల్సి ఉండ‌డంతో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు.

దీని కార‌ణంగా ఒక రోజు ముందు అంటే వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సంబంధించి జూలై 15న సోమ‌వారం ఎలాంటి సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ బోమంటూ స్ప‌ష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు , టీటీడీ స‌భ్యులు, ఇత‌ర ప్ర‌ముఖుల లేఖలు తీసుకోమ‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించి శ్రీ‌వారి భ‌క్తులు ఎలాంటి లెట‌ర్లు తీసుకు రావ‌ద్ద‌ని కోరారు. వీలైతే ఎస్ఎస్ డీ టోకెన్లు లేదా రూ. 300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు ఉన్న వారితో పాటు ఉచిత ద‌ర్శ‌నంకు మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.