DEVOTIONAL

శ్రీ‌నివాసుడి ఆల‌యం అద్భుతం

Share it with your family & friends

ద‌ర్శించుకున్న వెంక‌య్య నాయుడు

విశాఖ‌ప‌ట్నం – మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంకయ్య నాయుడు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించారు. పూజ‌లు నిర్వ‌హించారు. విశాఖపట్నం షీలా నగర్ లో శ్రీ తిరుమల బాలాజీ దివ్య క్షేత్రం ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి గుడిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించు కోవడం ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రార్థించానని తెలిపారు.

వసుధైక కుటుంబ స్ఫూర్తి భావనను పెంచే కేంద్రాలు దేవాలయాలు అని స్ప‌ష్టం చేశారు . రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆటుపోట్లను తట్టుకొని మనసు కుదుటప రుచుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను పెంచుకోవాలని పిలుపునిచ్చారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

ఆధ్యాత్మిక భావనతో సద్బుద్ధి, సత్ప్రవర్తన అలవడి జీవితం ఆనందమయం అవుతుందన్నారు. జీవితం సుఖ సంతోషాలతో సాగి పోవాలంటే ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పధాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

. భగవన్నామ స్మరణ, పూజలతో సానుకూల దృక్పథం అలవడుతుందని అన్నారు. విశాఖ ప్రజలకు ఇంతటి చక్కటి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి చక్కగా నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ, వారి మిత్రులకు, ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలిపారు వెంక‌య్య నాయుడు.