అరుణాచలానికి ఆర్టీసీ బస్సులు
ప్రకటించిన మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తీపి కబురు చెప్పారు. మన రాష్ట్రం నుండి ప్రతి రోజూ వేలాది మంది తమిళనాడులో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం అరుణాచలంకు ప్రయాణం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గురు పౌర్ణిమ రోజు లక్షలాది మంది భక్తులు అరుణాచలం శివుడిని దర్శించుకుంటారు. దీనిని పురస్కరించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు ఎండీ.
గిరి ప్రదక్షిణ చేసేందుకు వీలుగా భక్తుల కోసం తెలంగాణలోని హైదరాబాద్ , ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, కరీంనగర్, ఖమ్మం, మహబుబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 21న గురు పౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు వీసీ సజ్జనార్.