లోక్ సభ ఉప నాయకుడిగా గొగోయ్
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రకటన
న్యూఢిల్లీ – ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ఎంపీ గౌరవ్ గొగోయ్ కు అరుదైన ఛాన్స్ లభించింది. ఈ మేరకు లోక్ సభలో కీలకమైన అంశాలపై పదే పదే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, పీఎం నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను పదే పదే ఏకి పారేస్తూ వస్తున్నారు. తాజాగా సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
గౌరవ్ గొగోయ్ ను లోక్ సభలో ఉప నాయకుడుగా నియమించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ , గొగోయ్ ఇద్దరూ కీలకమైన నాయకులుగా ఎదిగారు. ప్రధానంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వస్తున్నారు.
మణిపూర్ తో పాటు దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నీట్ యుజీ 2024 స్కామ్ , ధరల పెరుగుదల, జీఎస్టీ పేరుతో ప్రజలను మోసం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు గౌరవ్ గొగోయ్. మరోసారి తన వాయిస్ ను ప్రజల తరపున వినిపించేందుకు రెడీ అయ్యారు.