నా జీవితం ప్రజలకు అంకితం
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ జిల్లా – ఊపిరి ఉన్నంత వరకు తాను ప్రజల కోసం పని చేస్తానని , పుట్టిన గడ్డకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్డడం తన అదృష్టమన్నారు. భారతీయ జనతా పార్టీలో రాజకీయాలు ఉండవన్నారు. కేవలం కష్టపడ్డ వారికి వారి సమర్థత, నిబద్దత ఆధారంగా పదవులు కట్ట బెడుతుందని స్పష్టం చేశారు.
తనను గత కొన్నేళ్లుగా ఆదరిస్తున్న ఈ మట్టి బిడ్డలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని అన్నారు బండి సంజయ్ కుమార్. ఇదిలా ఉండగా బండి సంజయ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కాపు వాడను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు భారీ ఎత్తున ఘన స్వాగతం లభించింది.
తనకు రాజకీయ జీవితం ఇచ్చింది కాపు వాడేనని చెప్పారు బండి సంజయ్ కుమార్. మొదటిసారిగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పోటీ చేసింది ఇక్కడి నుంచేనని గుర్తు చేసుకున్నారు. బతికినంత కాలం ఒకే సిద్దాంతం, ఒకే పార్టీతో పని చేస్తానని చెప్పారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నానని తెలిపారు.