పాకిస్తాన్ పై మండిపడ్డ భజ్జీ
ఇండియా వెళ్లదని కామెంట్
న్యూఢిల్లీ – భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది 2025లో పాకిస్తాన్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన భద్రత లేక పోవడం కారణంగా టీమిండియా పాకిస్తాన్ కు వెళ్ల బోవడం లేదని స్పష్టం చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా. తమ జట్టును పాకిస్తాన్ కు పంపించాలంటే ముందుగా భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్ ఇచ్చేందుకు సుముఖంగా లేదని పేర్కొన్నారు. దీని కారణంగా తాము పంపించ బోమంటూ కుండ బద్దలు కొట్టారు జే షా. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాత్రం భారత జట్టు రావాలని కోరుతోంది. ఇదే సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది.
అయితే దీనికి భిన్నంగా కొత్తగా ప్రతిపాదన తీసుకు వచ్చింది బీసీసీఐ. పాకిస్తాన్ కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా తటస్థ వేదికలపై ఆడేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. ఇదే నిర్ణయాన్ని ఐసీసీకి విన్నవించింది. దీనికి సంబంధించి హర్బజన్ సింగ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ కు వెళ్లందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం భజ్జీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.