NEWSANDHRA PRADESH

ఎన్టీఆర్ జీవితం అజ‌రామ‌రం

Share it with your family & friends

గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కితాబు

సింగ‌పూర్ – ప్ర‌పంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌తికే ఉంటార‌ని కొనియాడారు రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. ఆయ‌న స్పూర్తి చిర‌స్మ‌ర‌ణీయ మైన‌ద‌ని పేర్కొన్నారు.

తెలుగు దేశం ఫోరం ఆధ్వర్యం లో సింగపూర్ లో అన్న ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు జులై 14 న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికింది తెలుగు దేశం పార్టీ అని స్ప‌ష్టం చేశారు. ఎన్టీఆర్ తో త‌న‌కు ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. త‌న లాంటి ఎంతో మందికి రాజ‌కీయ ఓన‌మాలు దిద్దిన గొప్ప నాయ‌కుడు ఎన్టీఆర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

పేద‌ల‌కు కూడు, గూడు, గుడ్డ కావాల‌ని నిరంత‌రం త‌ప్పించిన మ‌హోన్న‌త నాయ‌కుడు అంటూ పేర్కొన్నారు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. భౌతికంగా లేక పోయినా ఎన్టీఆర్ చిర‌స్థాయిగా ప్ర‌జ‌ల హృద‌యాల‌లో నిలిచే ఉంటార‌ని చెప్పారు.