మీ పుట్టుకల మీదే అనుమానం ఉంది
సాంబశివరావు..వెంకట కృష్ణ..వంశీలపై ఫైర్
విశాఖపట్నం – వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓ ఆదివాసీ మహిళతో వివాహేతర సంబంధం అంటగట్టి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన వారిని ఊరికే వదలనంటూ హెచ్చరించారు.
సోమవారం విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరి బతుకు ఏమిటో అందరికీ తెలుసన్నారు. ఇవాళ అధికారం ఉంది కదా అని అన్యాయంగా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు అయి పోతాయా అని ప్రశ్నించారు.
ప్రధానంగా ఆయన మీడియా జర్నలిస్టులు వెంకట కృష్ణ, వంశీ, సాంబ శివ రావులను ఏకి పారేశారు. ఏ ప్రాతిపదికన వార్తలను ప్రసారం చేస్తారంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రివైలేజ్ మోషన్ కు పిలిపిస్తానని హెచ్చరించారు. కనీసం వార్తలను ప్రసారం చేసేటప్పుడు తన వివరణ తీసుకోవాలన్న ఇంకిత జ్ఞానం లేక పోతే ఎలా అని ప్రశ్నించారు.
తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. తిరిగి వైసీపీ అధికారంలోకి రాక తప్పదన్నారు. రాధాకృష్ణ, బీఆర్ నాయకుడు, వంశీ లాగా బ్లాక్ మెయిల్ చేయడం తనకు రాదన్నారు. తానేమిటో తన బతుకు ఏమిటో తనకు తెలుసు అన్నారు. తాను కష్టపడి పైకి వచ్చానని చెప్పారు. ఇకనైనా నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకుంటే మంచిదన్నారు విజయ సాయి రెడ్డి.
మొత్తంగా మీ పుట్టుకల మీదే తనకు అనుమానం కలుగుతోందన్నారు రాజ్యసభ సభ్యుడు.