NEWSANDHRA PRADESH

ఎంపీలు..ఎమ్మెల్యేలు ఆద‌ర్శంగా ఉండాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

మంగ‌ళ‌గిరి – ఎవ‌రైనా స‌రే పార్టీ నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి ఉండి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌. సోమ‌వారం మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ త‌ర‌పున తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను స‌న్మానించారు. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్సీని కూడా ఘ‌నంగా సత్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా పార్టీకి చెందిన ఇద్ద‌రు మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. పీఏసీ చైర్మ‌న్ గా మ‌నోహ‌ర్ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు వారంలో ఒక రోజు ప్ర‌జ‌ల కోసం కేటాయించాల‌ని అన్నారు. అంతే కాకుండా పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌లో ఎవ‌రో ఒక‌రు పార్టీ కేంద్ర ఆఫీసులో అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. అధికారంలోకి వ‌చ్చామ‌ని దుర్వినియోగం చేయొద్ద‌ని అన్నారు.

రౌడీయిజాన్ని నమ్మొద్దని, దురుసుగా మాట్లాడ్డం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని తాను వదులు కోవడానికి సిద్ధంగా ఉంటానని హెచ్చ‌రించారు. మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.