NEWSANDHRA PRADESH

కేంద్రంలోకి ర‌మ్మ‌న్నా..నేనే వ‌ద్ద‌న్నా

Share it with your family & friends

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్

మంగ‌ళ‌గిరి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌గిరి కేంద్ర పార్టీ కార్యాల‌యంలో సోమ‌వారం ఆయ‌న ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించిన ప‌వ‌న్ త‌న‌కు కేంద్రంలో కొలువుతీరే ఛాన్స్ వ‌చ్చింద‌న్నారు.

స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ కేంద్ర కేబినెట్ లోకి రావాల‌ని కోరార‌ని, కానీ తానే సున్నితంగా తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇదంతా త‌న కోసం కాద‌ని కేవ‌లం రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

తాను కేంద్రంలో ఉంటే ఇక్క‌డ ఏపీకి న్యాయం చేయ‌లేన‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల బాగోగులు మాత్ర‌మే త‌న‌కు అత్యంత ముఖ్య‌మ‌ని స్పష్టం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం. అడ‌గాల్సిన స‌మ‌యంలో రాష్ట్రం కోసం ప్ర‌ధానిని త‌ప్ప‌కుండా అడుగుతాన‌ని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అభివృద్ది చేయాల‌ని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాల‌ని, 20 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించాల‌ని తాను మోడీని అడిగి సాధించుకుని వ‌స్తాన‌ని స్ప‌ష్టం చ‌స్త్రశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.