డీకే శివకుమార్ కు బిగ్ షాక్
పిటిషన్ ను కొట్టి వేసిన కోర్టు
న్యూఢిల్లీ – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. అవినీతి నిరోధక చట్టం 1988 కింద సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు తనపై సీబీఐ నమోదు చేసిన కేసు కుట్ర పూరితమని, కక్ష సాధింపుతో, రాజకీయ దురుద్దేశంతో కూడినదని పేర్కొంటూ దానిని కొట్టి వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు డీకే శివకుమార్ సుప్రీంకోర్టులో.
ఇందుకు సంబంధించి డీకే శివకుమార్ కు సంబంధించిన ఈ కేసు విచారణ చేపట్టింది ధర్మాసనం సోమవారం. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా డీకే శివకుమార్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2020 సంవత్సరంలో డీకేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. 2013-2018 మధ్య ఆదాయ వనరులకు సంబంధించి ఎలాంటి పొంతన లేకుండా ఆస్తులు కూడ బెట్టారంటూ ఆరోపించింది.
విచారణలో భాగంగా డీకే శివకుమార్ కు సంబంధించి ఐటీ, ఈడీ, సీబీఐ సేకరించిన భారీ పత్రాలను పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. దీంతో డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ చెల్లదంటూ తిరస్కరించింది. దీంతో ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.