యుఎస్ అధ్యక్ష రేసులో ట్రంప్ ముందంజ
సర్వేలో ఆసక్తికర పరిణామం బైడెన్ వెనుకంజ
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికాకు ఎవరు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం బైడెన్ సర్కార్ కు ఢోకా లేక పోయినప్పటికీ తాజాగా చోటు చేసుకున్న విపత్కరమైన పరిణామాలు ఒకింత ఇబ్బందిగా మారేలా ఉన్నాయి.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో వెనుకంజలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి ప్రచారం సందర్బంగా నిర్వహించిన ర్యాలీలో ఊహించని రీతిలో ట్రంప్ దాడికి గురయ్యారు. ఆయనపై తూటాల వర్షం కురిసింది. ఆయన త్రుటిలో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నారు. ఓ తూటా చెవి మీదుగా వెళ్లింది. ఆయన చెవికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బతికి బయట పడ్డారు.
దీంతో ఈ దాడి ఘటన ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా మారిందని చెప్పక తప్పదు. తాజాగా చేపట్టిన సర్వేలో నిన్నటి దాకా ముందంజలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ను వెనక్కి నెట్టేశారు డొనాల్డ్ ట్రంప్.
ఈ మేరకు తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడి కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సర్వేలో ట్రంప్ కు 61 శాతం రాగా జో బైడెన్ కు 38 శాతం రావడం గమనార్హం.