నిరుద్యోగులపై దాడులు దారుణం
ఆర్ఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నిరుద్యోగ అభ్యర్థుల పట్ల పోలీసులు దాడులకు దిగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పరీక్షలను కొంత కాలం పాటు వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. ఇప్పటికే భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, యూనివర్శిటీలలో వీసీల అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించ కూడదని.
కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు సుప్రీం ఆదేశాలను అతిక్రమించడం, యూనివర్శిటీలోకి ప్రవేశించడం, ఇష్టానుసారంగా దాడులకు దిగడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇదే సమయంలో తాజాగా లైబ్రరీలో చదువుకుంటున్న వారిని కూడా లెక్క చేయకుండా నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా నిరుద్యోగుల న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.