NEWSANDHRA PRADESH

ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలోని మ‌హిళ‌లు, యువ‌తులు, బాలిక‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇచ్చిన హామీ మేర‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు వ‌చ్చే నెల ఆగ‌స్టు 15 నుంచి దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన రోజు గుర్తు పెట్టుకునేలా ఫ్రీ బ‌స్సు స‌ర్వీసు ప్ర‌వేశ పెడుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు త‌మ స‌ర్కార్ త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి మార్గ ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేస్తుంద‌ని చెప్పారు ఏపీ మంత్రి స‌త్య ప్ర‌సాద్ అంగానీ.

మంగ‌ళ‌వారం ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల ఆత్మాభిమానం పెరిగేందుకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల వివిధ రంగాల‌లో మ‌రింత రాణించేందుకు వీలు కుదురుతుంద‌ని తెలిపారు.

విద్యార్థినిలు, వృద్దులు, మ‌హిళ‌లు, యువ‌తులకు ఉచిత బస్సు ప్ర‌యాణం వ‌ర్తింప చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.