తెలంగాణ సర్కార్ కు సీజేఐ షాక్
విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చండి
న్యూఢిల్లీ – రేవంత్ రెడ్డి సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. విద్యుత్ సంస్థకు సంబంధించి కొనుగోలు వ్యవహారంలో భారీ స్కాం చోటు చేసుకుందని, దీనిపై విచారణకు ఆదేశించారు సీఎం. రిటైర్డ్ జడ్జి నర్సింహారెడ్డిని విద్యుత్ కమిషన్ విచారణ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఆయన మీడియా సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. దీనిపై భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్బంగా మంగళవారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. తీవ్రంగా తప్పు పట్టారు. తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారంటూ సీరియస్ అయ్యారు.
వెంటనే జడ్జిని మార్చండి. మరొక జడ్జిని నియమించాలని ఆదేశించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాదు నిష్పాక్ష పాతంగా ఉండాలని స్పష్టం చేశారు జస్టిస్ డీవై చంద్రచూడ్. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని ఆరోపించారు. విచారణకు ముందే దోషిగా కమిషన్ చైర్మన్ తేల్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.