సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
బలం పుంజుకున్న అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్తగా న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో అత్యున్నత న్యాయ స్థానానికి అదనపు బలం చేకూరింది. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లు మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా వీరి నియామకాలను ప్రకటించారు. న్యాయమూర్తులుగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 34 మంది న్యాయమూర్తులు అవుతారు.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుండి అత్యున్నత న్యాయస్థానంలో నియమితులైన మొదటి న్యాయమూర్తిగా నిలిచారు. జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఈ ఇద్దరికి న్యాయ పరంగా అపారమైన అనుభవం ఉంది. వీరి రాకతో మరింత కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు మార్గం ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.