NEWSTELANGANA

దాడులు ఆపండి న్యాయం చేయండి

Share it with your family & friends

బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి

హైద‌రాబాద్ – ప్ర‌భుత్వం త‌న ప‌ట్టు వీడాల‌ని, నిరుద్యోగులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాల‌ని కోరారు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అనుగుల రాకేష్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్య‌మైన‌ది కాద‌ని పేర్కొన్నారు.

నిరుద్యోగుల‌కు చ‌దువు కునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని, వారు కోరుతున్న‌ట్టుగా త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సానుకూల దృక్ఫ‌థంతో నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు.

వీరు కూడా తెలంగాణ బిడ్డ‌లేన‌ని మ‌రిచి పోవ‌ద్ద‌ని పేర్కొన్నారు. వారు చేస్తున్న‌ది న్యాయ బ‌ద్ద‌మైన పోరాట‌మ‌ని, వారికి ఏ రాజ‌కీయ పార్టీ మ‌ద్ద‌తు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి అనుమానాలు పెట్టుకోవాల‌ని సూచించారు అనుగుల రాకేష్ రెడ్డి.

జూన్ 2 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష చేప‌ట్టార‌ని, ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని, వాళ్లు అర్హ‌త సాధించార‌ని తెలుసుకుని జూలై 18 న ప్రారంభం అయ్యే డీఎస్సీ ప‌రీక్షకు అభ్య‌ర్థులు ఎలా ప్రిపేర్ అవుతారంటూ ప్ర‌శ్నించారు. ఇక‌నైనా కొంత స‌మ‌యం ఇచ్చేలా చూడాల‌ని కోరారు రాకేష్ రెడ్డి.